హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

NZB: చందూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 6, 9వ తరగతుల బాహ్య మూల్యాంకనాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసనలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, రవితేజ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు