హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేట: ధాన్యం కొనుగోళ్లకు 334 కేంద్రాలు!

SRPT: ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 3.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ధాన్యం సేకరణ కోసం 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా గన్నీ బ్యాగుల సరఫరా, ధాన్యం రవాణా సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.