WNP: కొత్తకోట, మదనాపురం మండలాల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను అదనపు కలెక్టర్ టి. వినోద్ కుమార్ సందర్శించి, తరగతి గదులు, వసతి గృహాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు విద్యతోపాటు మెరుగైన వసతి, నాణ్యమైన భోజనం, పారిశుద్ధ్యం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించాలి


