హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీ-సర్వే వేగవంతంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

WNP: పెబ్బేరు మండలం రామన్నపేటలో భూ రీ-సర్వేను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ టి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం తహశీల్దార్ కార్యాలయంలో భూభారతి, సాదాబైనామా, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సమీక్షించి, త్వరగా పరిష్కరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.