NZB: వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ ధర్పల్లి మండలం దుబ్బాక రైతులు గురువారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ కోతలతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన


