హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూపులు

SRPT: సూర్యాపేట జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ వ్యవసాయ విస్తరణ అధికారులకు (AEO O/S) ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదని ఉద్యోగులు తెలిపారు. జీతాలు రాక కుటుంబ, రోజువారీ ఖర్చుల నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. దసరా నాటికైనా పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని కోరారు.