హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం

MNCL: మంచిర్యాలలోని ఏసీసీ 3 అంగన్వాడీ కేంద్రంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం నాగలక్ష్మి గర్భిణీ స్త్రీలతో పాటు స్థానిక మహిళలకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు చేశారు. అవసరమైనవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఎన్. పద్మ, హెల్ఫర్ లత పాల్గొన్నారు.