హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘వృద్ధుల అనుభవమే సమాజానికి మార్గదర్శకం’

MLG: వృద్ధుల అనుభవాలు, జ్ఞానం భావితరాలకు మార్గదర్శకమని అదనపు కలెక్టర్ సంపత్ రావు అన్నారు. గురువారం ములుగు ఐడీఓసీలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. వృద్ధులను కుటుంబ సభ్యులు ప్రేమాభిమానాలతో చూసుకోవాలని, వారి ఆరోగ్యం, భద్రతపై శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం వృద్ధులను సన్మానించి, క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.