హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చు: ఎమ్మెల్యే

MBNR: ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సమావేశ మందిరంలో స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రక్తదానం చేయడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.