హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ ఫార్మర్

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ఈ ట్రాన్స్ ఫార్మర్ మురికికాలువపై ఏర్పాటు చేయడంతో ట్రాన్స్‌ఫార్మర్ గద్దెలు క్రమంగా కుంగిపోతుండటంతో కిందపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.