KNR: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ప్రభుత్వ వృద్ధుల వసతి గృహంలో గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుమతితో కార్యదర్శి యశ్వంత్ సింగ్ పాల్గొన్నారు. వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు, మందులు, సలహాలు అందించారు. వృద్ధుల హక్కులు, సంక్షేమానికి పాటుపడతామన్నారు.
తెలంగాణ
కరీంనగర్‌లో వయోవృద్ధుల దినోత్సవం


