హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌పై విజయం.. ఫైనల్‌కు భారత్ 

ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4-3 తేడాతో విజయం సాధించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో మెరిశాడు. సుఖ్‌జీత్ సింగ్, అభిషేక్ చెరో గోల్ చేసి జట్టు విజయానికి కీలకంగా నిలిచారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత్ చివరివరకు ఆధిపత్యం కొనసాగించింది.