హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తొలి ముద్ద' కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ASF: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంగన్వాడీలో  'తొలి ముద్ద' కార్యక్రమం గురువారం నిర్వహించారు.MLC దండే విఠల్,కలెక్టర్ హరిత, గ్రంథాలయ చైర్మన్ అనిల్ చిన్నారులకు తొలి ముద్ద తినిపించారు. పౌష్టికాహారం చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. తల్లిదండ్రులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.