హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీలకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలి'

MDK: ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సరికాదని జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం పేర్కొన్నారు. రామాయంపేటలోని బీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీసీలకు ఒక్క ఎమ్మెల్సీ స్థానమైనా కేటాయించాలని, కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.