NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు నిర్వహించిన 5 రోజుల హ్యాపీనెస్ కోర్స్ ముగిసింది. యోగా శిక్షకుడు పల్లపు బుద్ధుడు విద్యార్థులకు సుదర్శన క్రియ, యోగ, ధ్యానం నేర్పించారు. వీటి సాధన వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత పెరిగి విజయానికి పునాది ఏర్పడుతుందని తెలిపారు. వార్డెన్ తార శిక్షకుడికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
యోగా సాధన.. విజయానికి పునాది


