హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే’

HNK: ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం హన్మకొండ డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో కేయూ సమీపంలోని వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ, రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు. డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ నేరెళ్ల వెంకట హైమ పూజిత, సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ సభ్యురాలు డా. అనితారెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పిల్లలదేనన్నారు.