హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైటీపీఎస్ నిర్వహణ ప్రైవేట్ సంస్థకు..!

NLG: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఈ మేరకు టీజీ జెన్‌కో మూడేళ్ల కాలానికి రూ.279.20 కోట్లతో పవర్‌మెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐదు యూనిట్లలో బొగ్గు, బూడిద నిర్వహణతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల నిర్వహణ బాధ్యతలను సంస్థ చేపట్టనుంది. మరోవైపు బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి సగానికి పడిపోయినట్లు సమాచారం.