హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20ల్లో టీమిండియా సరికొత్త రికార్డ్

శ్రీలంకపై 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ టీ20ల్లో అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పొట్టి క్రికెట్‌లో అత్యధికంగా 100+ పరుగుల వ్యత్యాసంతో 11 సార్లు విజయాలు సాధించిన ఏకైక జట్టుగా టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కెనడా (10), ఆస్ట్రేలియా (9) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.