BDK: బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ పరిశ్రమ భూమికి సంబంధించి గిరిజన కుటుంబాలు గురువారం నిరసన చేపట్టాయి. తమ భూమిపై 29 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం పరిష్కారం కాలేదని బాధితులు ఆరోపించారు. హైకోర్టు, కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ తాళ్లగొమ్మూరు ఐటీసీ గేటు వద్ద బైఠాయించారు. భూమిలోకి వెళ్లకుండా ఐటీసీ వారు అడ్డుకున్నారని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
భూ వివాదం.. గిరిజనుల నిరసన


