KMR: పిట్లం మండలం కంబాపూర్‌లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సుజాత శ్రవణ్ దేశాయ్ ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని, పంటను నేరుగా కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, గ్రామస్థులు, పెద్దలు, ఐకేపీ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


