హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూరగాయల మార్కెట్‌ను పరిశీలించిన కలెక్టర్

WNP: వనపర్తి గాంధీచౌక్ వద్ద నిరుపయోగంగా ఉన్న కందకం కూరగాయల మార్కెట్‌ను వెంటనే శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం మార్కెట్‌ను పరిశీలించిన ఆయన, పట్టణ వారాంతపు సంతను ఇక్కడికి తరలించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మాధవి, పలువురు అధికారులు పాల్గొన్నారు.