హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీ'

HNK: కమలాపూర్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఆదిరెడ్డి, ఏవో వేణు దుకాణాలను పరిశీలించారు. కాలం చెల్లిన పురుగుమందులు విక్రయించవద్దని, ఎరువుల కొనుగోలుకు రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.