హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా

ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌తో బుమ్రా తన కెరీర్‌లో 99వ టీ20 మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ ధోనీ (98) రికార్డును అధిగమించి 6వ స్థానానికి చేరాడు. రోహిత్ 159 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు.