హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆర్చరీలో భారత్‌కు మరో పతకం

ఆసియా గేమ్స్ ఆర్చరీ విభాగంలో భారత్ మరో పతకం సాధించింది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో గణేష్ మణిరత్నం కాంస్య పతకం సాధించాడు. ఈ ఉత్కంఠభరిత పోరులో గణేష్ 149-144 తేడాతో వియత్నాంకు చెందిన కాంగ్ డక్ డాంగ్‌పై ఘన విజయం సాధించాడు. దీనికి ముందు జరిగిన సెమీఫైనల్స్‌ మ్యాచ్‌లో గణేష్ 144-148 తేడాతో దక్షిణ కొరియా ఆర్చర్ చేతిలో ఓడిపోయాడు.