హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపాలిటీలో ఉచిత మెగా వైద్య శిబిరం

BHNG: స్వచ్ఛత హి సేవా–2026లో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. చైర్మన్ టీ. శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరై తన బీపీ పరీక్ష చేయించుకుని శిబిరాన్ని ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, కౌన్సిలర్లకు బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలని సూచించారు.