ఆసియా క్రీడల్లో భారత మహిళల స్క్వాష్ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. సెమీఫైనల్ పోరులో భారత్ 1-2 తేడాతో హాంగ్‌కాంగ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ పతకంతో ప్రస్తుత ఆసియా క్రీడల్లో స్క్వాష్ విభాగంలో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే అనాహత్ సింగ్, అభయ్ సింగ్ రజతాలు సాధించగా, జోష్నా చిన్నప్ప-వేలవన్ సెంథిల్‌కుమార్ జోడీ కాంస్యం గెలుచుకుంది.
క్రీడలు
మహిళల స్క్వాష్ జట్టుకు కాంస్య పతకం


