BHPL: రేగొండ మండలం చిన్నకొడపాక శివారులో పంట కాలువ మూసుకుపోవడంతో వందల ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో కాలువకు అడ్డంకి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు మాత్రమే పైపు ఏర్పాటు చేసి మరోవైపు మట్టితో మూసివేశారని తెలిపారు. కాలువను వెంటనే పునరుద్ధరించి పంటలకు నీరందించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
'కాలువలను వెంటనే పునఃరుద్ధరించాలి'


