హైదరాబాద్: 28°C
తెలంగాణ

గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన

PDPL: ధర్మారం మండలం న్యూ కొత్తపల్లి గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం బాలింతలు, గర్భిణులకు బాలామృతం ప్యాకెట్లు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారుల ప్రభుత్వం అందించే పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందాల మల్లేశం, అంగన్‌వాడీ టీచర్ వసంత, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.