హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి SA-1.. తర్వాతే దసరా సెలవులు

VKB: విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించేందుకు ఉద్దేశించిన SA-1 (సమ్మెటివ్ అసెస్మెంట్) పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదివే వారికి అక్టోబర్ 1 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే 1 నుంచి 5వ తరగతి పిల్లలకు అక్టోబర్ 5 నుంచి 9 వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.