హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడిషనల్ కలెక్టర్ పదవి విరమణ

జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌గా బి.ఎస్.లత క్రమశిక్షణతో, సమయస్ఫూర్తితో పని చేశారని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం రాత్రి అడిషనల్ కలెక్టర్ లత పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోళ్లలో జిల్లాను అగ్ర స్థానంలో నిలపడంలో ఆమె ముఖ్యపాత్ర పోషించారని అన్నారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్, ఇతర సిబ్బంది సన్మానించారు.