హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతి హత్య కేసులో యువకుడి అరెస్ట్

KMM: జూలూరుపాడు మండలంలో యువతి మృతి కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటన తర్వాత అతడు అందుబాటులో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. ఏపీ పరిధిలోని తిరుపతి సమీపంలో పోలీసులు అతడిని గుర్తించి పట్టుకున్నారు. నిందితుడిని విచారించిన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.