హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌ బస్టాండ్‌లో రద్దీ

KNR: సీఎం రేవంత్ రెడ్డి సభకు 400 బస్సులను తరలించడంతో కరీంనగర్ బస్టాండ్ లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు రూట్లో సరిపడా సర్వీసులు లేక బస్సుల కోసం గంటల తరబడి వేచి చూశారు. జేబీఎస్, సిద్దిపేట, గోదావరిఖని, జగిత్యాల, నిజామాబాద్, తదితర రూట్లో బస్సుల కొరత కనిపించింది. దీంతో కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించగా.. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ఛార్జీలు వసూలు చేశారు.