నారాయణపేట: ఊట్కూర్ పీహెచ్‌సీ గేటు నుంచి వివేకానంద చౌరస్తా వరకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, పారాసెటమల్ సిరప్ బాటిళ్లు రోడ్డుపై కనిపించాయి. సిరప్ బాటిళ్లపై ఈ నెల 26తో గడువు ముగిసినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థులు, పశువులు సంచరించే ప్రాంతంలో వైద్య వ్యర్థాలు పడేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
రోడ్డుపై గడువు ముగిసిన మందుల కలకలం


