హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాచారి కన్నుమూత

మహబూబ్ నగర్: దేవరకద్రకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాచారి మృతి చెందారు. మూడు దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో పనిచేస్తూ జర్నలిజం రంగానికి సేవలందించారు. ఆయన మరణం పట్ల పలువురు జర్నలిస్టులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. నిజాయితీతో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన కృష్ణాచారి సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి మీడియా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.