WGL: వర్ధన్నపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ చాడ మరియా (సురేఖ) ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడిని గురువారం కలిశారు. వరంగల్–మామునూరు విమానాశ్రయ ప్రారంభోత్సవానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఆహ్వానించాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. అనంతరం మంత్రిని శాలువాతో సత్కరించి భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
తెలంగాణ
కేంద్ర మంత్రిని కలిసిన చాడ మరియా


