హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫూలే దంపతుల విగ్రహాల ముందు మొబైల్ టాయిలెట్‌పై అభ్యంతరం

HYD: నెక్లెస్‌రోడ్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాల ముందు జీహెచ్ఎంసీ మొబైల్ టాయిలెట్ బస్సును ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫూలే దంపతుల విగ్రహాల గౌరవాన్ని కాపాడాలని, అక్కడి నుంచి మొబైల్ టాయిలెట్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.