హైదరాబాద్: 28°C
తెలంగాణ

12 నుంచి మహాపారాయణోత్సవం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అక్టోబర్ 12 నుంచి 21 వరకు 10 రోజులపాటు తానీషా కళ్యాణ మండపం వెనుక మారుతీ సదనంలో శ్రీరామాయణ మహాపారాయణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఎంపికైన 108 మంది పారాయణదారులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. ఇతర భక్తులకూ భోజన సౌకర్యం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.