హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భారీ గుంతలు ఏర్పడి అధ్వానంగా టోంకిని రోడ్డు

ASF: సిర్పూర్ (టి) మండలం టోంకిని రోడ్డు అధ్వానంగా మారింది. పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు విన్నవించినా స్పందన లేదని స్థానికులు తెలిపారు. రాత్రివేళ గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.