హైదరాబాద్: 28°C
తెలంగాణ

'38 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు'

MLG: ఏటూరునాగారం వివిధ ఐటీడీఏల్లో 38 ఏళ్లపాటు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి టీవీఆర్ దామోదర స్వామిని ఘనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఆయన సేవలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ చిటమట రఘు, ఎండీ ఖలీల్ ఖాన్, ముక్కెర లాలయ్య, చెర్ప రవీందర్ తదితరులు పాల్గొన్నారు.