BDK: అశ్వారావుపేట మండలం రేగడిగుంపునకు చెందిన మడివి నంద(35) కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై యయాతి రాజు వివరాల ప్రకారం.. ఈ నెల 28న భార్య మందలించడంతో క్షణికావేశంలో కలుపు మందు తాగాడు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. భార్య మడవి లక్కీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య


