హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ జడేజా చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో అమీర్ జాంగోను ఔట్ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత్-విండీస్ వన్డేల చరిత్రలోనే అత్యధిక వికెట్లు (45) తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు కోర్ట్నీ వాల్ష్ (44) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో 27 ఏళ్ల వాల్ష్ ఆల్‌టైమ్ రికార్డును జడేజా బ్రేక్ చేశాడు.