హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత ఆర్చరీ క్రీడాకారులకు జగన్ అభినందనలు

ఆసియా క్రీడల్లో సత్తాచాటిన భారత ఆర్చరీ క్రీడాకారులను ఏపీ మాజీ సీఎం జగన్ అభినందించారు. పురుషులు కాంపౌండ్ టీమ్ విభాగంలో కుశాల్, సాహిల్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు స్వర్ణపతకాలు సాధించడంపై జగన్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ చూపారని, భారతదేశ కీర్తిని మరింత పెంచారని కొనియాడారు. గణేష్ మణిరత్నం ఏపీకి చెందిన క్రీడాకారుడు కావటం మనందరికీ గర్వకారణమని అన్నారు.