హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్: రేపు లంకతో భారత్ ఢీ

ఆసియా గేమ్స్ పురుషుల క్రికెట్‌లో రేపు భారత్, శ్రీలంక జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్‌తో పాటు సోనీలివ్ యాప్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్ వీక్షించవచ్చు. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను కలవరపెడుతోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే భారత్ ఫైనల్ చేరుకుంటుంది.