JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన ఆశిష్ కులకర్ణి, కవిత దంపతులు రూ.6.50 లక్షల విలువైన మారుతి సుజుకి ట్రాలీ గూడ్స్ వాహనాన్ని విరాళంగా అందించారు. దేవస్థానంలోని వివిధ పనులకు వాహనాన్ని వినియోగించనున్నారు. ఈ సందర్భంగా ఈవో సంకటాల శ్రీనివాస్ దంపతులను శేష వస్త్రం, ప్రసాదంతో సన్మానించారు.
తెలంగాణ
ధర్మపురి ఆలయానికి వాహనం విరాళం


