హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోటళ్లపై సివిల్ సప్లై అధికారులు దాడి

CTR: కట్టమంచి పరిసర ప్రాంతాల్లో హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న 7 గృహవినియోగ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు బుధవారం సీజ్చేశారు. DSO వెంకట్రాముడు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో మూడు 6 ఏ కేసులు నమోదు చేశారు. వాణిజ్య అవసరాలకు గృహ సిలిండర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని, ఇకపై తరచూ దాడులు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.