హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్‌లో విద్యార్థుల మాక్ పార్లమెంట్

JGL: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 'మాక్ పార్లమెంట్' నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పార్లమెంటరీ కార్యకలాపాలను ప్రదర్శించారు. చిన్న వయసు నుంచే చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే మాక్ పార్లమెంట్ ముఖ్య ఉద్దేశమన్నారు.