హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఎం శ్రీ పోటీల్లో కమాన్‌పూర్ విద్యార్థుల ప్రతిభ

PDPL: పెద్దపల్లి జిల్లా స్థాయిలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల పోటీల్లో కమాన్‌పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. మాక్ పార్లమెంట్ విభాగంలో చరిష్మా ప్రథమ, రవిత్రేణి ద్వితీయ బహుమతులు సాధించి జిల్లా విద్యాధికారి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. విద్యార్థులను ఎంఈఓ విజయ్‌కుమార్ అభినందించారు.