NDL: తంబళ్లపల్లిలో టీడీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మదనపల్లె పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. పర్యటన విజయవంతానికి కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించి, అభ్యర్థుల విజయానికి నేతలు సమష్టిగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల విజయానికి నేతలు కృషి చేయాలి: మంత్రి


