హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కోచ్ అవార్డ్స్‌కు PMDS ప్రెజెంటేషన్

కర్నూలు జిల్లా కలెక్టరేట్‌ నుంచి PMDS కార్యక్రమాన్ని స్కోచ్ అవార్డ్స్‌కు నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం స్కోచ్ గ్రూప్ అధికారులు దేశవ్యాప్తంగా నామినేట్ అయిన కలెక్టర్లు, వివిధ శాఖల డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లాలో అమలు చేసిన PMDS, దాని ద్వారా సాధించిన ఫలితాలను వివరించారు.