TPT: తలకోన అటవీ ప్రాంతం సమీపంలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్న నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరించింది. రాత్రివేళ పంట పొలాల వద్దకు వెళ్లవద్దని, ఏనుగును తరిమేందుకు లేదా ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించవద్దని సూచించింది. ఏనుగు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తలకోన ప్రాంతంలో ఏనుగు ప్రత్యక్షం


